డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!

  • జూన్‌ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం
  • జ్యోతిష్యుడి సలహాతో ముహూర్తం ఖరారు
  • సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం
  • లాంఛనంగా సీఎల్‌పీ నేత ఎన్నిక
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చర్చించేందుకు శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈరోజు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పటి నుంచి ఈ ప్రమాణ స్వీకార తేదీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

జ్యోతిష్యుడి సలహాతో
డీకే శివకుమార్ దైవభక్తి గల వ్యక్తి కావడంతో తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాతే జూన్ 3న ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఈ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నిర్వహించాలని డీకే భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం?
మరోవైపు మంత్రివర్గ కూర్పు, సిద్ధరామయ్య వర్గాన్ని సర్దుబాటు చేయడంపై ఢిల్లీలో ముమ్మర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనికి ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య నేతృత్వం వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డీకేను సీఎల్‌పీ నేతగా ఎన్నుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది.

DK Shivakumar
Karnataka CM
Karnataka Chief Minister
Siddaramaiah
Congress
Karnataka Politics
Oath Ceremony
CLP Leader
Thawar Chand Gehlot
Karnataka Government

More Telugu News